- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూర్, వెలుగు: తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం నావాంద్గి రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలును శుక్రవారం నుంచి నిలిపేలా నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ మంత్రి తనకు సమాచారం అందించినట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
శుక్రవారం తాను హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వయంగా ప్రయాణం చేస్తానని చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. హుబ్లీ రైలు హాల్టింగ్తో తాండూర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. తన మన్నించి రైలు నిలుపుదలపై నిర్ణయం తీసుకున్నందుకు రైల్వే మంత్రి, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
